Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఔషధ శాస్త్రంలో కృత్రిమ మేధస్సు అపారమైనది

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : ఔషధ శాస్త్రంలో కృత్రిమ మేధస్సు అపారమైనది ఉపకులపతి ఆచార్య జింక రంగా జనార్దన్ పేర్కొన్నారు. గురువారం జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం
అనుబంధ తైల సాంకేతిక పరిశోధన సంస్థ కళాశాల రెండవ బ్యాచ్ ఫార్మా.డి. విద్యార్థులకు స్వాగతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం ఉపకులపతి గారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఫార్మా. డి. కోర్సుకు ఎంతో విశిష్ట ప్రాధాన్యం ఉందని అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలకు అబివృద్ది పరచుకోవాలని తెలిపారు. ఫార్మా యంత్ర అబ్యాసన యొక్క ప్రాధాన్యతను వివరించారు. మరప్రజ్ఞ అందుకు అనుగుణంగా సంస్థ లో డిజిటల్ ఫార్మాసీ ల్యాబ్ ను ఏర్పాటు చేశామని , పరిశోధనా కార్యక్రమాలను విస్తృతం చేయాలని తెలిపారు.
అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ మాట్లాడుతూ. ఫార్మా.డి విద్యార్థులు కోవిడ్ సమయంలో విశిష్ట సేవలు అందించారని, విద్యార్థులు అందుబాటులో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిరంతరం నైపుణ్యాలను అబివృద్ది చేసుకొని సమజాబి వృద్దికి తోడ్పడాలని కోరారు. కళాశాల డైరెక్టర్ ఆచార్య బి. దుర్గా ప్రసాద్ .. భవిష్యత్ లో విద్యార్థులు ఉద్యోగార్జనే ధ్యేయంగా కాకుండా ఉద్యోగాలను కల్పించే వ్యక్తులుగా రూపొందాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సర్వతో ముఖాబివృద్దికి తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని, విద్యార్థులు పట్టుదలతో విద్యనభ్యసించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని తెలిపారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. వివిధసాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సి. గోపీనాథ్ , ఫార్మా.డి. డా పవన్ కుమార్ , శ్రావణ్ , బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img