Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహిళా సాధికారితకు ఆసరాగా చేయూతనిస్తున్నాం

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ లోని వంశిక కళ్యాణ మండపం నందు జరిగిన వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కం కింద మూడో విడ‌త సాయాన్ని ల‌బ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయ‌స్ జగన్మోహన్ రెడ్డి జమచేసిన సందర్భంగా, మూడో విడ‌త సాయాన్ని పొందిన అక్క చెల్లెమ్మలతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మెగా చెక్క ను అందజేసిన, నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ ఎమ్మెల్సీ మంగమ్మ , జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ పాల్గొన్నారు పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని మూడవ విడత కింద 454 సంఘాలకు గాను సోమవారం 3,04,18,850 రూపాయల మెగా చెక్కులు పంపిణీ చేశారు మహిళా సాధికారతకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ పట్టణ మరియు మండల ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img