Monday, September 25, 2023
Monday, September 25, 2023

పొలం విషయంలో వ్యక్తిపై దాడి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :మండల పరిధిలోని గవిగట్టు గ్రామంలో పొలం విషయంలో మూగలదొడ్డి అయ్యప్పను అదే గ్రామానికి చెందిన నరసయ్య కుమారులు మంగళవారం దాడి చేసి గాయపరిచారు. ఉదయం అయ్యప్ప పొలంలో పని చేస్తుండగా నరసయ్య కుమారులు చిన్న రాముడు, పెద్ద నరసయ్య, మహాదేవ, చిన్న నరసయ్య పొలంలో మాకు భాగం ఉందని వాదనకు దిగారు. మీతో ఏవైనా ఆధారాలు ఉంటే తీసుకొని రండని చెప్పినా నాతో ఘర్షణకు దిగి నలుగురు కలిసి కట్టెలు, రాళ్లతో దాడి చేశారని తనను హత్య చేయడానికి ప్రయత్నించారని భాధితుడు విలేకరుల ముందు వాపోయారు. తనపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లో అయ్యప్ప ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img