Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

తల్లిదండ్రులు మందలించినందుకు ఆత్మహత్యాయత్నం


విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని గిర్రాజు కాలనీలో గల రమేష్ లక్ష్మీదేవి దంపతుల కుమారుడు అయిన బాలకృష్ణ బడికి సరిగా పోవటం లేదని బుధవారం మందలించారు. ప్రస్తుతం బాలకృష్ణ మూడవ తరగతి. సాయి నగర్ లోని ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నాడు. మందలించినందుకు అక్కడే ఉన్న కొన్ని మాత్రలను హఠాత్తుగా మింగేశాడు. తల్లిదండ్రులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img