జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణానికి చెందిన 60 మంది ఆటో డ్రైవర్లకు (సిఎన్జి గ్యాస్) డీలర్ షిప్ వచ్చిన గ్యాస్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అన్న ఫిర్యాదును జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి విని ఈనెల 30వ తేదీ లోపు ఆటో గ్యాస్ ఇప్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎన్జి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్లకు గ్యాస్ ఇవ్వకపోతే వారి జీవన ప్రమాణం దెబ్బతింటుందని, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను సీరియస్ గా తీసుకొని సంబంధిత గ్యాస్ ఏజెన్సీ వారితో మాట్లాడడం జరిగిందని, వారు కూడా సానుకూలంగా స్పందించి ఈనెల 30వ తేదీ లోపల తప్పక ఇస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు చిలక మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.