విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు వైకే. శ్రీనివాస్, కార్యదర్శి సి .రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని స్వాతి క్లినిక్ లో మెగా శిబిరం యొక్క కరపత్రాలను వారు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం బెంగళూరు- కావేరి హాస్పిటల్ ఆధ్వర్యంలో, యువర్స్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ శిబిరములో గుండె జబ్బులు, బిపి, జీర్ణకోసము ప్రేగులు, కాలేయ సంబంధిత లక్షణములు, మొలలు, నూతి, ఫిషర్, శరీరములోని ఏ భాగంలోనైనా కనితి హెర్నియా, వరిబీజం తదితర లక్షణాలు కలిగిన వారికి ఉచిత వైద్య పరీక్షలు, తగిన సలహా, సూచనలు కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ ఎం. సౌమ్య, జనరల్ లాప్రోస్కోపియన్ సర్జన్ ఏ. అనూష వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందన్నారు. క్యాంపు చైర్మన్గా బండ్లపల్లి రంగనాథం, ఓ.వీ. ప్రసాదు వ్యవహరిస్తారని తెలిపారు. అంతేకాకుండా కావేరి హాస్పిటల్ లో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె జబ్బులు, జీర్ణ కోసం, ప్రేగులు, కాలేయము సంబంధిత వ్యాధులకు ఉచిత చికిత్స ఆపరేషన్ కూడా నిర్వహిస్తారని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులు కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ బి వి. సుబ్బారావు, కోటేశ్వరరావు, వాసుదేవుడు, రమేష్ బాబు, శివప్రసాద్, బండి నాగేంద్ర, కావేరి హాస్పిటల్ ప్రతినిధి మునీంద్ర, పిఆర్ ఓ..జయరాం తదితరులు పాల్గొన్నారు.