Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

పంటల దిగుబడులు పై రైతులకు అవగాహన సదస్సు

విశాలాంధ్ర, ఎన్ పీ కుంట: రైతులు సాగు చేస్తున్న పంటల దిగుబడులను పెంచేందుకై రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ శశికళ పేర్కొన్నారు. వాటర్ షెడ్ రైతులకు మంగళవారం మండల కేంద్రంలోని చెరువు ఆర్ బి కే లో ధనియాన్ చెరువు మరికొమ్మదిన్నె వాటర్ షెడ్ రైతులకు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో పంటల దిగుబడులపై రైతులకు శిక్షణ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త శశికళ మాట్లాడుతూ రైతులు ముఖ్యంగా తమ వ్యవసాయ భూమిని భూసార పరీక్షలను చేయించుకోవాలన్నారు. అదేవిధంగా తేమ, సంరక్షణ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, జీవన ఎరువుల ప్రాముఖ్యతను రైతులకు తెలియజేశారు. రైతులు ఏ పంటను ఏ నెలలో సాగు చేస్తే దిగుబడులు ఆశ జనకంగా ఉంటాయో తెలుసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త జి శశికళ పేర్కొన్నారు. అదేవిధంగా పశువైద్యాధికారి బాలనాయక్ మాట్లాడుతూ గొర్రెలు పెంపకం, జెర్సీ ఆవుల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు . ముఖ్యంగా గొర్రె పిల్లల పెంపకం వలన పశుకాపురులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని పశువైద్యాధికారి వివరించారు. డా. జి. శశికళ, కృషి విజ్ఞాన కేంద్రం లో వ్యవసాయ దిగుబడులపై జరుగు కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ జి శశికళ, నవీన్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ సిబ్బంది భాస్కర్, వాటర్ షెడ్ చైర్మన్లు కృష్ణారెడ్డి, ఓబుల్ రెడ్డి, మరియు వాటర్ షెడ్ కమిటీ సభ్యులు , రైతులు ,మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img