అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు
విశాలాంధ్ర -ధర్మవరం : రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలంలోని మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు గురువారం అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు సుబ్బరాజు, ఈశ్వర లింగం ఆధ్వర్యంలో అవయవ దానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం సుబ్బరాజు ఈశ్వరలింగంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శరీర అవయవాలను దానం చేయవచ్చునని, అందులో గుండె దానం, నేత్రదానం, దేహదానం, చర్మదానం, కేశ దానం, రక్తదానం లాంటివి చేయవచ్చునని తెలిపారు. ప్రతి విద్యార్థి అన్ని విషయాలను అవగాహన చేసుకున్నప్పుడే విజయపతములో నడుస్తారని తెలిపారు. గుండె దానం చేయడం ద్వారా పలువురికి పునర్జన్మను ఇస్తారని, నేత్రదానం వల్ల ఇరువురికి కంటి వెలుగు వస్తుందని, అవయవ దానములో కిడ్నీ, కాలేయమును కొంత భాగాన్ని మాత్రమే చేయవచ్చునని తెలిపారు. దేహ దానములో వ్యక్తి మరణించిన తర్వాత తన శరీరాన్ని వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు చేసుకునేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. చర్మ దానములో వీపు, పొట్ట, తొడలు, కాళ్లపై ఉండే చర్మాన్ని మరణానంతరం ఇవ్వవచ్చునని తెలిపారు. కేశ దానము క్యాన్సర్ వ్యాధిన పడిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కేశ దానములో 12 అంగుళాల పొడవైన జుట్టును దానం చేయాలని తెలిపారు. మృతి చెందిన వారి వెంట్రుకలను కత్తిరించి, పోస్టు, కొరియర్ ద్వారా కూడా పంపవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కంటి వైద్యాధికారి, ధర్మవరం రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్. నరసింహులు, రోటరీ క్లబ్ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, రెడ్ క్రాస్ కోశాధికారి సత్య నిర్ధారన్, ప్రిన్సిపాల్ స్వర్ణలత, మోడల్ స్కూల్ అండ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.