Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని యల్లనూరు రోడ్డు జయ నగర్ కాలనీలో మంగళ వారం బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వై. రామాంజనేయులు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్ల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రా సమగ్రా భివృద్ధి కోసం పేదలకు గృహాలు, ఉచితంగా ఆహార పంపిణీ, వైద్యరంగం, రైతులకు చేయూత అందించారన్నారు. అంతేకాకుండా ముద్ర యోజన, జల్ జీవన్ పథకం కింద గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు, జన్ ధన్ యోజన, కోవిడ్ వ్యాక్సిన్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రధానమంత్రి మోడీ ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించారని ప్రజలకు తెలియచెప్పారు. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సింగరి లక్ష్మీనారాయణ ఓబీసీ మోర్చా పట్టణ కార్యదర్శి మధు బాబు ఓబీసీ మోర్చా రూరల్ కార్యదర్శి శివ, సంజీవ, రాధాకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img