Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

డెంగ్యూ వ్యాధి పై అప్రమత్రత అవసరం

సబ్ యూనిట్ ఆఫీసర్ జయరాం నాయక్

విశాలాంధ్ర – ధర్మవరం : డెంగ్యూ వ్యాధిపై ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ సరియైన సమయంలో వైద్య చికిత్సలను పొందాలని సబ్ యూనిట్ ఆఫీసర్ జయరాం నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం- పోతుకుంట సచివాలయ పరిధిలోని బీసీ కాలనీలో డెంగ్యూ వ్యాధి లక్షణాలు గల ఇళ్లను గురువారం సందర్శించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఉన్న వాళ్లందరి రక్త నమూనాలను సేకరించారు. తదుపరి దాదాపు 80 ఇళ్లల్లో షఫీనోత్రిన్ పిచికారి చేయడం జరిగింది. అనంతరం ఆంటీ లార్వా ఆపరేషన్ కూడా చేయడం జరిగిందని తెలిపారు. అక్కడున్న ప్రజలందరికీ డెంగ్యూ వ్యాధి చికెన్ గునియా మలేరియా తదితర వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. రాత్రిపూట దోమతెరలు వాడాలని సాయంకాలం సమయంలో వేపాకు పొగ వేసుకోవాలని, ఇంటి చుట్టుపక్కల, పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం. శ్యామల, ఎమ్మెల్హెచ్ పి గౌతమి, హెల్త్ అసిస్టెంట్ ఆంజనేయులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img