విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని విజయనగర్ కాలనీలో ఉన్న పద్మవాణి స్కూల్ లో శనివారం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి. శ్రీనివాసులు రోడ్డు భద్రత నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మోటార్ వెహికల్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. 4 చక్రాల వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.18 సంవత్సరాల లోపు వయస్సు గల విద్యార్థి విద్యార్థులు మోటార్ సైకిల్ నడపరాదు. అలా నడిపే వారిపై, వారి తల్లిదండ్రులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. మోటార్ సైకిల్ నడుపుతూ సెల్ఫోన్ వాడరాదు. అలా సెల్ఫోన్ వాడడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆల్కహాల్, గుట్కా తదితర డ్రగ్స్ వాడి ఆ మత్తులో వాహనాలు నడపడం వలన ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. పాఠశాల నుండి ఇంటికి, ఇంటి నుండి పాఠశాలకు వచ్చే సమయాల్లో రోడ్డు నియమాలు పాటించాలని విద్యార్థులకు తెలియజేశారు. మీరు సురక్షితంగా ఉండాలి సమాజంలోని వారిని కూడా సురక్షితంగా ఉండేలా మీరు మీ తల్లి దండ్రుల ద్వారా అందరికీ తెలియజేయా లని ఉద్భోదించారు. పాఠశాల కరస్పాండెంట్ జి.నాగాపీరయ్య హెడ్మాస్టర్ మహబూబ్బాషా , సువర్ణ రాజు ఉపాధ్యాయబృందం విద్యార్థులు పాల్గొన్నారు.