విశాలాంధ్ర, కదిరి : కదిరి పట్టణంలో రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో జన జాగృతి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల పలువురికి అవగాహన కల్పించారు.రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, జన జాగృతి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా?” హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా సమాజములో కలసి జీవించాలి,కండోమ్ యొక్క ఉపయోగమంపై హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డా.లిఖిత్ రెడ్డి,జన జాగృతి ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసాలు తెలియచేసారు.యాక్ట్ 2017 ఏ ఆర్ టి మందులు,టోల్ ఫ్రీ నెంబర్ 1097 ద్వారా తెలుచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనసూయ,ప్యారి,నీరజ,నిర్మల ఆశావర్కర్లు పాల్గొన్నారు.