Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

జిల్లాలో బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలు, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

: జిల్లా కలెక్టర్ యం. గౌతమి

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : జిల్లాలో బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలు మరియు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ యం. గౌతమి ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం (1994డ రూల్స్ 1996, పిసిడపిఎన్డిటి యాక్ట్)అమలుకు సంబంధించి జిల్లాస్థాయి జాయింట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, సచివాలయం ఏఎన్ఎం, మహిళా పోలీస్, అంగన్వాడి వర్కర్, ఆశా వర్కర్ కమిటీగా ఏర్పడి కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.యుగంధర్, అదనపు జిల్లా పోలీస్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణవేణి, డ్రగ్ ఇన్స్పెక్టర్ హనుమన్న, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఐసిడిఎస్ నోడల్ ఆఫీసర్ వనజాక్షి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఆర్డిఎ ఎపీడీ ఈశ్వరయ్య, మెప్మా అంజద్ హుస్సేన్, విద్యాశాఖ అదనపు డైరెక్టర్ నాగరాజు, జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటరమణ నాయక్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి గైనకాలజిస్ట్ డా.పార్వతి, రేడియాలజిస్ట్ డా. సురేష్, పీడియాట్రీషియన్ డా.రవికుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డా.సుజాత, నారాయణస్వామి, అనుపమ, మహేందర్, ఎస్ఓ మారుతి ప్రసాద్, ఆర్డిటి హెల్త్ డైరెక్టర్ సిరప్ప, రెడ్స్ సంస్థ భానుజా, హెడ్స్ సంస్థ విజయ్ కుమార్, డెమో ఉమాపతి త్యాగరాజు, గంగాధర్, వేణు, కిరణ్, వెంకటేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img