Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఘనంగా జరిగిన బాలయ్య జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర- ధర్మవరం : హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు అయినా నందమూరి బాలకృష్ణ 63వ జన్మదిన వేడుకలను శనివారం పట్టణ అభిమానుల సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. తొలుత సిద్దయ్య గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కేక్ కట్ చేశారు. అనంతరం బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ సినీ పరిశ్రమ కార్మికులను అనేక రకాలుగా ఆదుకున్నారని, ఎమ్మెల్యేగా ప్రజలకు ఎన్నో సేవలు అందించి, మంచి నాయకుడిగా గుర్తింపు పొందడం జరిగిందన్నారు. విద్య, వైద్య విషయంలో తనకు తానే సాటి అని ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం జరిగిందన్నారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గరుగు వెంగ ప్ప, బొట్టు కృష్ణప్ప అభిమానులు నజీర్ ఖాన్, ఆర్టీసీ సూరీడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img