ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య,నియోజకవర్గ అధ్యక్షులు శివ
విశాలాంధ్ర – ధర్మవరం : పదవ తరగతి పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేదని విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా వేధిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు గైకొనాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య నియోజకవర్గ అధ్యక్షులు శివ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం వారు స్థానిక సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఒంపుటబడులు ప్రారంభించా లని, ప్రతి ఒక్క పరీక్ష సెంటర్లో ఫ్యాన్లు, లైట్లు, బెంచులు ఏర్పాటు చేయాలి అని, ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులుగా సౌకర్యం లేకుండా ఇబ్బందికరంగా లేకుండా పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. పాఠశాల ఫీజులు చనువుగా తీసుకొని విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు జయవర్ధన్, వేణు, అభి తదితరులు పాల్గొన్నారు.