Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులుగా బత్తిని ప్రసాద్ ఎంపిక

విశాలాంధ్ర – ధర్మవరం : ఇటీవల ఆరవ తేదీన అనంతపురం విజయనగర లా కళాశాలలో జరిగిన ఆలిండియా లాయర్స్ యూనియన్ రెండవ జిల్లా మహాసభలో (ఏఐఎల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతన అనంతపురం జిల్లా కమిటీ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో ధర్మవరానికి చెందిన లాయర్ బత్తిని ప్రసాదును జిల్లా ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశారు. అనంతరం బత్తిని ప్రసాద్ మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయ శాస్త్ర బోధకులు, సంబంధిత సంస్థ, భారత రాజ్యాంగం మూల విలువలు, లక్ష్యాలు కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా యూనియన్ పని చేస్తోందని తెలిపారు. ఈ యూనియన్ మహాసభలో ఆరు తీర్మానాలను చేయడం జరిగిందని, న్యాయవాదుల రక్షణ చట్టం అమలులోకి తేవాలని, జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం ప్రతినెల ఇవ్వాలని, కోర్టులో మౌలిక సదుపాయాలను కల్పించాలని, మణిపూర్లో పౌర హక్కులను కాపాడి, శాంతి భద్రతలను కాపాడాలని, కొత్త కోర్టులు ఏర్పాటు చేయాలన్న విషయాలపై ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. నామీద నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అహర్నిశలు న్యాయవాదుల అభివృద్ధికి తాను కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img