Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎంపీపీ

విశాలాంధ్ర- నందికొట్కూరు : సీజనల్ వ్యాధుల పట్ల పశువుల యజమానులు జాగ్రత్త వహించి వాటిని బాగా చూసుకోవాలని ఎంపీపీ మురళి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని కోనేటమ్మ పల్లె గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ చిడ పా రోగం టీకాల కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా టీకాలు వాటి ప్రాముఖ్యత ప్రతి గొర్రెకు మరియు మేకకు గుర్తింపు కోసం వాటి చెవులకు 12 అంకెల నెంబర్ వేయడం గురించి ఎంపీపీ రైతులకు తెలియజేశారు. అదేవిధంగా నందికొట్కూరు సహాయ సంచాలకులు డాక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ పశువర్ధక శాఖలో ప్రస్తుతం జరిగే కార్యక్రమాలను తెలియజేస్తూ 50 శాతం సబ్సిడీతో మిశ్రమ దానమృతం, అందుబాటులో ఉందని గడ్డి కోసే యంత్రం 25 శాతం సబ్సిడీతో 20,382 రూ అందుబాటులో ఉందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దామోదర్ రెడ్డి, పశు వైద్యాధికారులు షణ్ముఖి, రాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img