Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ప్లోరోసిస్ వ్యాధిపట్ల జాగ్రత్తగా ఉండాలి

మెడికల్ ఆఫీసర్లు. పుష్పలత, దిలీప్ కుమార్
విశాలాంధ్ర – ధర్మవరం : ఫ్లోరోసిస్ వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పుష్పలత డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మండల పరిధిలోని దర్శనమల ప్రైమరీ హెల్త్ సెంటర్లో జాతీయ ఫ్లోరోసిస్ నివారణ కార్యక్రమంలో భాగంగా ఫ్లోరోసిస్ బాధితులకు రిహాబి లిటేషన్ ఎయిడ్స్ (పునరావాసం) పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అక్కడే సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే సర్వే నిర్వహించి తదుపరి పాఠశాలలోను, ఇంటింటికి సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. వివిధ రకముల క్లోరోసిస్ సంబంధించిన అనుమానాస్పద కేసులను గుర్తించి, వారికి మూత్ర రక్తపరీక్షలను సేకరించి, జిల్లా కేంద్రానికి పంపించి, రోగి నిర్ధారణ చేయడం జరుగుతుందన్నారు. అవసరమైన వారికి పునరావాస సహాయక చర్యలను చేపట్టి అందులో భాగంగా 15 నడుము బెల్టులు 5 మెడ బెల్టులు అందించడం జరిగిందన్నారు. ఇలాంటి వారికి భవిష్యత్తులో అవసరమైన మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి శాస్త్ర చికిత్సలు కూడా చేస్తామని, అంతేకాకుండా ఆరోగ్యశ్రీ సంబంధించిన హాస్పిటల్స్ లో కూడా చేయడం జరుగుతుందన్నారు. వైద్య చికిత్సలు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. అలాగే త్రాగు నీటిలో ఫ్లోరైడ్ శాతమును కూడా పరీక్షించి సంబంధిత అధికారులతో మాట్లాడి, ఉచిత మంచి త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. క్లోరైడ్ నివారణకు సంబంధించిన ఆహార పదార్ధములు ఏమి తీసుకోవాలో అందరికీ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కళావతి, ఎంపీహెచ్వో శివయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img