Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నీటి కాసుల వ్యాధిపై అవగాహన లేనందునే అందత్వం ఏర్పడుతుంది

రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నర్సింహులు

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రజలలో కంటి విషయములో భాగంగా నీటి కాసుల వ్యాధిపై అవగాహన లేనందునే కంటి చూపు కోల్పోవడంతో పాటు ,పూర్తి అందత్వము వస్తోందని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కన్ను అండ్ వృద్ధుల వైద్యశాల- మధు ఆప్టికల్స్ నందు శుక్రవారం ప్రపంచ నీటి కాసుల వ్యాధి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు నీటి కాసుల వ్యాధి పై పలు విషయాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వారోత్సవాలు ఈనెల 12వ తేదీ నుండి 18 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, కంటిలో ఒత్తిడి కలిగినప్పుడు, అదేవిధంగా అవగాహన లేకపోవడం వలన కంటి చూపును కోల్పోవడం జరుగుతోందన్నారు. ఈ నీటి కాసుల వ్యాధిపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన కల్పించుకొని సరియైన సమయంలో వైద్య చికిత్సలను కూడా పొందాలని తెలిపారు. తద్వారా కంటి చూపులు కాపాడుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నీటి కాసుల వ్యాధి పలు రకాలుగా ఉంటుందని పుట్టుకతోనే కాకుండా పిల్లల కళ్ళల్లో పెద్దవిగా ఉండడం, వయస్సు మీరితే ఎర్రబడి నొప్పిగా ఉండడం లాంటివి జరుగుతాయన్నారు. చాప కింద నీరు లాగా నొప్పి ఉండకుండా, క్రమంగా చూపు తగ్గడం జరుగుతుందని ఇదే నీటి కాసుల వ్యాధిగా గుర్తించవచ్చునని తెలిపారు. తద్వారానే కంటి చూపు హరించి, అందత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ కూడా బీపీ వ్యాధిని ఏ విధంగా కాపాడుకుంటారో కంటికి కలిగే కంటి శుక్లముగాని నీటీ కాసుల వ్యాధిపై కూడా అంతే శ్రద్ధను కనపరిచి,తమ కండ్లను కాపాడుకోవాలని సూచించారు. నేడు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ వ్యాధిపై అవగాహన లేనందునే కంటిచూపులు పూర్తిగా కోల్పోతున్నారని వారు తెలియజేశారు. ఇందులో భాగంగానే ఈనెల 19వ తేదీ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img