ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణ
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో క్రమశిక్షణతో కూడినటువంటి బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించడం సంతోషదాయకంగా ఉందని ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు కరాటే కూడా జీవితములో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. స్పోర్ట్స్ లో కూడా కరాటే ఉందని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవాలంటే కరెటే ఎంతో అవసరమని తెలిపారు. పిల్ల లెక్క తల్లిదండ్రులు కూడా కరాటే పట్ల శ్రద్ధ చూపాలని తెలిపారు. అనంతరం కరాటే శిక్షణలో ఎన్నో మెలుకువలను నేర్పి, విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్న కరాటే మాస్టర్ ఇనాయత్ భాషను ప్రత్యేకంగా అభినందించారు.