Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

జగనన్న తోనే సంక్షేమ పథకాల లబ్ది

జెడ్పిటీసీ ఇంటూరి భారతి

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోనే అభివృద్ధి,సంక్షేమ పథకాల లబ్ది చేకూరుతుందని జెడ్పిటీసీ ఇంటూరి భారతి తెలిపారు.శనివారం మండలంలోని పోలినేనిపాలెం గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర,సర్పంచ్ అనుమోలు అమరేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జెడ్పిటీసీ ఇంటూరి భారతి,ఎంపీపీ పొనుగోటి మౌనిక హాజరైనారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వంవైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమంకోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమపథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేరువచేస్తున్నారని,ఇటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనూ లేరన్నారు.సచివాలయవ్యవస్థను తీసుకొని వచ్చి ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమపథకాలను అందించేవిధంగా వలంటీర్ వ్యవస్థ ను తీసుకొని వచ్చారని అన్నారు. కార్యక్రమం అనంతరం లబ్ధిదారులకు సర్టిఫికెట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఫిక్ అహ్మద్,తహసీల్దార్ సుందరమ్మ,డీ టీ హుస్సేన్, మండలమీడియా అధికార ప్రతినిధి పరిటాల వీరాస్వామి,మండల జేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు,వైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు నాయకులు అనుమోలు సుబ్బారావు,నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి,అనుమోలు లక్ష్మీనరసింహం,యాళ్ల శివకుమార్ రెడ్డి, అనుమోలు వెంకటస్వామి,వైసీపీ సోషల్ మీడియా మండలకన్వీనర్ బందెల మాల్యాద్రి మండలఅధికారులు, మండలనాయకులు సచివాలయ సిబ్బంది,గృహసారధులు, వలంటీర్లు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img