విశాలాంధ్ర-శింగనమల మండల పరిధిలోని లోనూరు క్రాస్ సమీపంలో గల బిగ్ బాస్కెట్ కంపెనీ లీలలు ఒక్కొక్కటిగా బయటకుపొక్కుతున్నాయి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ రైతులను బురిడీ కొట్టిస్తూ రైతులను మోసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది అక్కడ పనిచేస్తున్న సిబ్బంది రైతుల నుండి తక్కువ రేట్లకు పండ్లను కొనుగోలు చేసి కంపెనీకి అధిక మొత్తంలో అమ్ముతూ వచ్చిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లో కాకుండా సిబ్బంది బినామీల ఖాతాల్లో జమ చేయిస్తూ రైతులను నట్టేట ముంచి కోట్ల రూపాయల సొమ్మును బిగ్ బాస్కెట్ కంపెనీ నిర్వాహకుల1.60కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టారని,కంపెనీ ఉద్యోగుల బంధువుల పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఉద్యోగులు, జేబులో నింపుకున్నారని,
గత కొంతకాలంగా బిగ్ బాస్కెట్ గౌడౌన్ మూత వేయడంతో కంపెనీ ఉద్యోగుల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తు న్నాయని రైతులు వాపోతున్నారు, ఇప్పటికైనా కంపెనీ నిర్వాహకులు స్పందించి రైతుల రుణాలు చెల్లించే విధంగా కృషి చేసి రైతులను మోసం చేసిన కంపెనీ ఉద్యోగులను కఠినంగా శిక్షించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు