Friday, December 1, 2023
Friday, December 1, 2023

అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం ఆశీర్వదించండి

మాజీ ఎమ్మెల్యే సుధాకర్
విశాలాంధ్ర-రొళ్ల:-కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మడకశిర నియోజకవర్గన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని మరొక్కసారి తనను ఆశీర్వదించాలని కాంగ్రెస్ ముందడుగు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పేర్కొన్నారు.మాజీ మంత్రి మాజీ ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఆదేశాల మేరకు మండలంలో ప్రజల ఆశీస్సుల కోసం కాంగ్రెస్ పార్టీ ముందడుగు కార్యక్రమం లో భాగంగా శుక్రవారం మండలంలోని ప్రజలతో పార్టీ నాయకులతో కలిసి హొట్టేబెట్ట కల్లురోప్పం కొత్తపాల్యం కే.పి తండా కొడగారిగుట్ట కాలనీ కొడగారిగుట్ట రోళ్ల కొండ హెచ్.ఎం పల్లి ఆవినకుంట గ్రామాలలో ప్రజల ఆశీస్సుల కోసం ముందడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని మరియు నీలకంఠాపురం ఎన్.రఘువీరారెడ్డి నేతత్వంలో ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు సీసీ రోడ్లు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రేషన్ కార్డులు శ్రీరామిరెడ్డి తాగునీరు హంద్రి నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు అభయ హస్తం మహిళలకు పావలా వడ్డీకే రుణాలు మరిన్ని సంక్షేమ పథకాలతో పాటు ఇతర అభివృద్ధిని ప్రజలకు వివరించారు తొలుత హోట్టేబెట్టా గ్రామంలో వెలిసిన మారమ్మ దేవాలయంలో పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఆహ్వానిస్తూ స్వచ్ఛందంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఇస్తామని మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున భరోసా కల్పించారన్నారు ముఖ్యంగా నా ప్రియతమ నాయకులు రఘువీరారెడ్డి త్వరలోనే అన్ని గ్రామాలలో పర్యటించి మడకశిర ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటారన్నారు అందుకోసమే ప్రజల ఆశీస్సుల కోసం ముందడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ బి.ఎన్ మూర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ గౌడప్ప మైనార్టీ సెల్ అధ్యక్షుడు అన్వర్ కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు డి.ఆర్ జ్యోతి మాజీ ఎంపిటిసి సన్నదాసప్ప మాజీ సర్పంచ్ నాగరాజు నాయకులు దాసేగౌడ్ లాయర్ శ్రీనివాస్ ముద్దప్ప బల్లెకట్టప్ప శ్రీరంగప్ప అశ్వత్తరావు నాగరాజు జగన్నాథ్ రామకృష్ణారెడ్డి గంగారామ్ రంగారెడ్డి N.రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img