Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Friday, October 4, 2024
Friday, October 4, 2024

దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేట్లను బహిష్కరించండి

వ్యవసాయ రంగాన్ని కార్మిక రంగాన్ని కాపాడండి
విశాలాంధ్ర -అనంతపురం : కేంద్ర కార్మిక సంఘాలు ,సంయుక్త కిసాన్ మోర్చిఅఖిల భారత పిలుపులో భాగంగా ఁక్విట్ కార్పొరేట్- సేవ్ అగ్రికల్ఛరల్ఁ నినాదంతోఅనంతపురము లలిత కళాపరిషత్తు కూడలి నుండి ర్యాలీతో టవర్ క్లాక్ దగ్గర వద్ద నిరసన ఆగస్టు 9 భారతదేశ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాడిని ఈ దేశం వదిలి వెళ్లిపోవాలని నాడు గాంధీ క్విట్ ఇండియా పిలుపునిచ్చారని నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెడుతున్నారని. క్విట్ కార్పొరేట్ సేవ్ అగ్రికల్చర్ నినాదంతో శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపిరైతుసంఘము జిల్లాఅద్యక్షులు
డి.చిన్నప్ప యాదవ్ అద్యక్షతవహించగా ఈ సందర్భంగా వక్తలు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి. మల్లికార్జున ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రాజారెడ్డి, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,,సిఐటియు జిల్లా అధ్యక్షులు నాగమణి, రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ,రైతు కూలి సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కౌలురైతుసంఘముజిల్లా ప్రధాన కార్యదర్శి బాల రంగయ్య, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు ముఖ్యఅథితులుగా పాల్గోనడమైనది.
ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజారెడ్డి, రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ,మాట్లాడుతూ…
కేంద్ర బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లో బడాబాబులకు రాయితీలు ఇచ్చి ప్రజలపై వేల కోట్ల రూపాయలు భారాల మోపారని,రైతులకి విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు సబ్సిడీలు కోత పెట్టారన్నారు. ఒకవైపు దేశం పౌష్టిక ఆహారం లోపం బాధపడుతుంటే సమగ్ర శిశు సంక్షేమ శాఖకి 300 కోట్లు తగ్గించాలని పేర్కొన్నారు. ఈ కాలంలో ఉపాధి హామీ జాబు కార్డులు 35 లక్షలు రద్దు చేశారని. ఉపాధి హామీకి నిధులు కోత పెట్టారని, కార్పొరేట్ కంపెనీలకి లాభాలు కలిగించేలా నూతన విధానాల్ని అమలు చేస్తున్నారన్నారు. ఉపాధి కల్పించే చర్యలు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి 50వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో నిధులు సేకరించాలని నిర్ణయం చేశారని దుయ్యబట్టారు. ఇది పూర్తిగా కార్పొరేట్ బడ్జెట్ అని ఎన్నికలకు ముందు పార్లమెంట్లో మోదీ మూడు రైతు వ్యతిరేక చట్టాల్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అవి నేటికీ కూడా రద్దు చేయలేదని, కార్మికులకి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్స్ ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ లేబర్ కోడ్స్ వలన భవిష్యత్తులో కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతారని, ఈ సవరణలు కంపెనీ యాజమాన్యాలకి అనుకూలంగా ఉన్నాయన్నారు. మరోవైపు మూడు నల్లవ్యవసాయ చట్టాలు అధికారికంగా రద్దు చేస్తాం, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేస్తాము, 2020సఃకి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాముఅని ప్రగాల్పాలు పలికిన మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ తుంగలోకి తొక్కి కార్పొరేట్ రంగానికి ఎర్ర తివాచి పరిచి రైతులను నట్టేట ముంచుతున్న మోడీని చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సంయుక్త కిసాన్ మోర్చానాయకులు , దస్తగిరి, యేసు రత్నము,
ఏ .మల్లికార్జున ,వెంకట నారాయణ ,చిరంజవి,రామకృష్ణ, కిష్టా, రాయుడు, మధు యాదవ్ ,లలితమ్మ, శివారెడ్డి ,చలపతి,గోపాల్ కుల్లాయప్ప,
ఏఐటియుసి రైతుకౌలు సంఘం నాయకులు, ఏఐటియుసి నాయకులు సిఐటియు నాయకులుప్రజా సంఘాలనాయకులుపాల్గోనడమైనది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img