Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల పై సమావేశం..

ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని బ్రాహ్మణవీధిలో గల శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 27వ తేదీ నుండి మే ఆరవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయుటకు గాను, తగిన ఏర్పాట్లు పై శనివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ కుండా చౌడయ్య, ఆలయ ఈవో వెంకటేశులు, పాలకవర్గ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఈ సమావేశంలో ప్రతిరోజు జరిగే బ్రహ్మోత్సవాలతో పాటు, తేరు పండగ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహించుటకు తగిన సలహాలు, సూచనలు అవసరమైనందునే ఈ సమావేశమును నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. కావున ఈ సమావేశానికి ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, పట్టణ ప్రముఖులు, భక్తాదులు పాల్గొని విజయవంతం చేయాలని వారి కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img