Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది

డెమో అధికారి బాబా ఫక్రుద్దీన్

విశాలాంధ్ర – ధర్మవరం : తల్లిపాలే బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుందని డెమో అధికారి బాబా ఫక్రుద్దీన్, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సెల్వి సల్మాన్,, హాస్పిటల్ సూపర్డెంట్. డాక్టర్ నజీర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మలత తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులకు బాలింతలకు తల్లిపాల వారోత్సవాల వాటి వివరణ గురించి తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుండి ఆరు నెలల వరకు విధిగా తల్లిపాలే ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఆహారపు పదార్థాలు ఏదైనా ఇవ్వవచ్చని తెలిపారు. తల్లి, శిశువు డాక్టర్ల యొక్క సలహాలను పొంది, ఆరోగ్యం గా ఉండాలని తెలిపారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు త్రాగించాలని, ఆపాలే మొదటి వ్యాక్సిన్ లాగా బిడ్డకు వేద నిరోధక శక్తిని పెంచుతుందని తెలిపారు. నిర్ణీత కాలమాన ప్రకారం బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని తెలిపారు. సొంత వైద్యం నాటు వైద్యం తల్లి శిశువుకు చేయించరాదని, అనుకూలమైన ప్రభుత్వ ఆసుపత్రులలోనే, వైద్య చికిత్సలు పొందాలని తెలిపారు. శిశువును ఎత్తుకునే విధానము, ప్రతిరోజు తల్లి బిడ్డకు ఎన్నిసార్లు పాలు ఇవ్వాలి?, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వారు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిపి యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్, నర్సింగ్ సూపర్వైజర్ రమాదేవి, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img