Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కంది పంటను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోండి

విశాలాంధ్ర-రాప్తాడు : ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన కంది పంటను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏఓ శుభకర్ సూచించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి గ్రామంలోని కంది పొలాలను శుక్రవారం సందర్శించారు కంది పంట అంతా పూత దశలో ఉందని రైతులు ఈ సమయంలో సస్యరక్షణ చర్యలు వ్యవసాయ సిబ్బంది ద్వారా చేపట్టాలన్నారు పూత కాయ సమయంలో కంది పంటకు ఎక్కువగా ఆకు చుట్టు పురుగు కాయ తులసి పురుగు మరుకా మచ్చల పురుగులు ఆశిస్తాయన్నారు వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 ఎంఎల్ లేదా క్వినాల్ ఫాస్ 2.0 ml క్లోరో ఫైరిఫాస్ 1.5 ml నీటికి కలిపి పిచికారి చేయాలని అన్నారు. అదేవిధంగా బెట్ట సమయంలో బట్టలు తట్టుకోవడానికి యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి పిచికారి చేయడం వల్ల పూత, కాయ రాలకుండా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓ మహాలక్ష్మి, వీహెచ్ఏలు సోనీ, ప్రియలత, నవ్య, ఎంపీఈఓ నళిని ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img