Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

ధాన్యం కొనుగోలును తక్షణమే చేయాలి

విశాలాంధ్ర, పార్వతీపురం/పాలకొండ: మన్యం జిల్లాలోని పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో వీరఘట్టం మండలం చలివేంద్రిగ్రామంలో రైతులపై పెట్టిన కేసులు తక్షణమే ఎత్తివేయాలని, రైతులకు జిల్లా కలెక్టర్ క్షమాపణ చెప్పాలని, తక్షణమే రైతుల ధాన్యం కొనుగోలుచేసి ఆదుకోవాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతుకూలీ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.గురువారం ఈగ్రామంమీదుగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ వెళ్తున్న సమయంలో ఆయన వాహనాన్ని రైతులు నిలిపి ఆందోళన వ్యక్తం చేయగా ఆయన సచివాలయానికి రైతులను పిలిచి మాట్లాడిన తీరును వారంతా ఖండించారు.శుక్రవారం చలివేంద్రిగ్రామంను వారంతా సందర్శించి సంఘీభావం ప్రకటించి అండగా ఉంటామని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లాకార్యదర్శి బుడితి అప్పలనాయుడు,తెలుగుదేశం పార్టీ పాలకొండ ఇంఛార్జి నిమ్మక జయకృష్ణలు మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జిల్లాలో జరగడం రైతుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు.తక్షణమే రైతులవద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని,చలివేంద్ర గ్రామరైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని,జిల్లా కలెక్టర్ , రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.రైతుకూలీ సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ పి శ్రీనునాయుడు మాట్లాడుతూ రైతులు తమగోడు చెప్పుకుందామని ఆయనకు నిరసన చెప్పగా ఆయన సచివాలయానికి రప్పించి దుర్భాష లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.గ్రామంలో పెద్ద ఎత్తున ధాన్యం బస్తాలు ఉండగా సర్పంచును, మీడియా ప్రతినిధులనుకూడా దూరముగా ఉంచి మాట్లాడినతీరు రైతులందరి మనసులను ప్రభావితం చేసిందన్నారు. దీనికి నిరసనగా జిల్లాకలెక్టర్ వెళ్ళాక గ్రామసచివాలయoకు రైతులు తలుపులువేసి తాళంవేసారని, కొంతసేపు తరువాత రైతులే తాళాలు తీశారన్నారు.గ్రామ సర్పంచ్ కు, రైతులకు జరిగిన అవమానాన్ని భరించలేక జరిగిన రైతులు తీవ్ర ఆవేధన వ్యక్తం చేస్తున్నారన్నారు.ఈకార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ విస్సు, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి సూరయ్య, సిపిఎం న్యూ డెమోక్రసీ నాయకులు విశ్వేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి సంగాo, సిపిఎంఎల్ లేబరేషన్ పార్టీ నాయకులు భాస్కరరావు, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం పాలకొండ నియోజకవర్గ కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడు, గ్రామరైతులు బొత్స శ్రీనివాసరావు, లక్ష్మణరావు,ఆనందరావు బొత్స గౌడునాయుడు, గ్రామరైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అరెస్టులను నిలుపదల చేయాలి: జిల్లా సీపీఐ, సీపీఎం నేతల డిమాండ్
మన్యంజిల్లాలోని చలివేంద్రి గ్రామంలో గురువారం జరిగిన సంఘటనలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, అరెస్టులు నిలుపుదల చేయాలని మన్యం జిల్లా సీపీఐ,సీపీఎం పార్టీలు డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మన్మధరావు, సహాయ కార్యదర్శి జీవన్, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి వేణు లు వేర్వేరు ప్రకటనలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, లేనిచో ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
24మందిరైతులపై కేసులు: డి ఎస్పీ కృష్ణారావు
చలివేంద్రిలో జిల్లా కలక్టర్ వాహనాన్ని నిలిపివేత,సచివాలయంకు తాళంవేసిన ఘటనలో వేర్వేరుగా రెండు కేసులలో 26మంది రైతులపై కేసులు నమోదు చేశామని పాలకొండ డి.ఎస్పి కృష్ణారావు తెలిపారు.ఇంతవరకు రైతులు ఎవరినీ అరెస్టులు చేయలేదని తెలిపారు. గ్రామ రైతులు జిల్లాకలక్టర్, ఎస్పీలను కలవడం జరిగిందని, శాంతియుతంగా సమస్య పరిష్కారం జరుగుతుందన్నారు.గ్రామంలో సీఐ కె. మురళిధర్ ఆద్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వాహనం నిలుపుదల,సచివాలయంకు తాళం వేయడం తదితర సంఘటనల దృష్ట్యా వీరఘట్టం ఎస్ ఐ హరికృష్ణను తాత్కాలికంగా బాధ్యతలు తప్పించి
విఆర్ లో పెట్టారు.
రైతులు ధాన్యంను కొనుగోలుకు సిద్దం
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ పాల్, జిల్లా పౌరసరఫరాల అధికారి (డిఎం) లు గ్రామానికి రెండు లారీలు తీసుకొని వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసిన తరువాత దాన్యాన్ని ఇస్తామని రైతులు ముక్తకంఠంతో వారికి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img