Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఆర్డిఓ కోర్టుకు సంబంధించిన కేసులను తరలించరాదు…

బార్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ధర్మవరం ఆర్డిఓ కోర్టుకు సంబంధించిన కేసులను తరలించరాదని కోరుతూ బుధవారం ఆర్డిఓ తిప్పే నాయక్ కు వినతి పత్రాన్ని బార్ అసోసియేషన్ వారు వినతి పత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవేంద్ర మాట్లాడుతూ ఈ విషయాన్ని చర్చించేందుకు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామని, జిల్లా కలెక్టర్, ఆర్డీవో కనపరిచిన సూచన మేరకు ధర్మవరం ఆర్డీవో కోర్టులోని మన కేసులను తరలించరాదని తెలిపారు. దీనివల్ల ఇటు న్యాయవాదులకు అటు కక్షిదారులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వారు తెలిపారు. కావున ప్రభుత్వం ఆర్డిఓ కోర్టు కేసులను తరలించకుండా తగిన న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ తోపాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img