Monday, March 20, 2023
Monday, March 20, 2023

చట్ట వ్యతిరేక పనులు చేస్తే కేసులు నమోదు చేస్తాం

వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలో ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై, చట్ట వ్యతిరేక పనుల పైన దృష్టి సారించారు. ఇందులో భాగంగానే శుక్రవారం కేశవ నగర్ లో నివాసముంటున్న పల్లా వెంకట చలపతి అనే వ్యక్తి పరమేశ్వర సినిమా హాల్ వెనుక బాగాన శుక్రవారం (రాబడిన రహస్య సమాచార మేరకు) మట్కా రాస్తుండగా, సిబ్బందితో వెళ్లి దాడి చేసి అతని వద్ద గల మట్కా చీటీలతోపాటు నగదు రూ.40,150 లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తదుపరి ఆ వ్యక్తిని కోర్టుకు పంపడం జరిగిందన్నారు. మట్కా పేకాట లాంటివి అలవాటు అయితే కుటుంబం చిన్నాభిన్నమవుతుందని, భార్యా ,పిల్లలు రోడ్డు పాలు అవుతారని తెలిపారు. పట్టణంలో పేకాట మట్కాలాంటి వి జరుగుతున్న ఎడల సెల్ నెంబర్:9440796831 కు సమాచార అందించాలని వారు తెలిపారు. సమాచారమిచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img