కళాజ్యోతి కార్యదర్శి బి. రామకృష్ణ.
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కళాజ్యోతిలో ఈనెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు కళాజ్యోతి ప్రాంగణంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు కళాజ్యోతి కార్యదర్శి బాలగొండ్ల రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కళాజ్యోతి అధ్యక్షుడు కుంట మల నారాయణ, ముఖ్య అతిథి ప్రధాన వ్యక్తగా విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు తెలుగు భాషా సంరక్షణ సమితి అధ్యక్షులు బి. నారాయణ హాజరవుతున్నట్లు వారు తెలిపారు. తదుపరి భారత యువ కళా రత్న హైదరాబాద్ రవితే మిమిక్రీ కార్యక్రమము కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున ఈ తెలుగు భాషా దినోత్సవం వేడుకలకు అధిక సంఖ్యలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు.