విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 117 వ కళ్యాణ బ్రహ్మరథోత్సవ మును జయప్రదం చేయాలని ఆదివారం వెంకటేశ్వర స్వామి ఆవరణ నందు ఆలయ కమిటీ పెద్దలు బ్రహ్మోత్సవాల నిర్వహణ కమిటీ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన గోడపత్రికలను ప్రచార పత్రికలను విడుదల చేశారు ఈ బ్రహ్మోత్సవాలు 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు ఆరు రోజులపాటు నిరాటంకంగా పూజలు నిర్వహించబడునని 9వ తేదీ పంచామృత అభిషేకంతో ప్రారంభమై 14వ తేదీ విశ్వరూప దర్శనంతో ముగింపు కార్యక్రమం ఉంటుందని కావున పెనుకొండ ప్రాంతంలోని ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమాలను హరినాథ్ కుటుంబ సభ్యులు ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణను ప్రతి ఏడాది నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యాడికి నాగరాజు ప్రగతి శ్రీనివాసులు పూర్ణచంద్ర రంగనాథ్ ప్రధాన అర్చకులు రామకృష్ణ మాచార్యులు రమేష్ స్వామి పాల్గొన్నారు.