Friday, April 19, 2024
Friday, April 19, 2024

నికర జలాల పరిరక్షణ మహా పాదయాత్రను జయప్రదం చేయండి

రాయలసీమ స్టీరింగ్ కమిటీ

విశాలాంధ్ర -ధర్మవరం:: నికర జలాల పరిరక్షణ కొరకు ఈనెల 25 నుండి 28వ తేదీ వరకు నిర్వహించబడే మహా పాదయాత్ర ప్రజాప్రదర్శనను జయప్రదం చేయాలని రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు అశోకవర్ధన్ రెడ్డి, సీమ కృష్ణ ,అంకాల రెడ్డి-టీచర్, రామకృష్ణారెడ్డి -కవి,భూషణ్ ,తదితర విద్యార్థి నాయకులు తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలోని స్పందన ఆసుపత్రి ఆవరణములో డాక్టర్ బషీర్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం రాయలసీమ స్టీరింగ్ కమిటీ వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సాగునీటి రంగంలో చర్చనీయాంశంగా మారిన అంశం అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 5,300 కోట్లు కేటాయించడం ప్రసార మాధ్యమాలలో నాయకుల ప్రసంగాల్లో సాధారణ ప్రజానీకం లో కూడా వీటి గూర్చి తీవ్రమైన వాదోపవాదాలలో ఒకంతగా ఆందోళన చేకూరుస్తున్నాయని తెలిపారు. అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల ఆయకట్టు మన గడుపై కూడా సందేహాలు కలుగుతున్నాయని తెలిపారు. గందరగోళాల మధ్య కేంద్ర ప్రభుత్వం హడావుడిగా జాతీయ హోదా ప్రకటించి బడ్జెట్ కేటాయించడంలో వివాదంగా మారిందని తెలిపారు. ఈ అప్పర్ భద్ర నిర్మాణం వలన అసలకే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రాయలసీమలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులే అందుకనే మన హక్కుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. అందుకే వీటి పరిష్కారం కొరకు ఈనెల 25వ తేదీ కర్నూలు జిల్లా కోసగి మండలం రాజోలి బండ తూముల దగ్గర ప్రారంభమై 26న కోసిగి మండల కేంద్రంలో చేరి 27న పెద్ద కడుబూరు మండల కేంద్రం చేరడం 28వ తేదీన బైజీ గేరి క్రాస్ నుండి నికర జలాల పరిరక్షణ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కావున ఈ పాదయాత్రను ప్రజా ప్రదర్శనలో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img