ఆర్డీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు టి.రామాంజనేయులు
విశాలాంధ్ర-గుంతకల్లు : దళిత హక్కుల సాధనకై ఈనెల 25వ తేదీన రాయలసీమ దళిత సంఘం ఆధ్వర్యంలో దళిత చైతన్య యాత్రకు ఎస్సీ, ఎస్టీలు జయప్రదం చేయాలని ఆర్డీఎస్ వ్యవస్థాపకులు టి.రామాంజనేయులు పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఆధ్వర్యంలో పత్రికా ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా టి. రామాంజనేయులు మాట్లాడుతూ… ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేసి ఎస్సీ,ఎస్టీ కాలనీలలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ కాలనీలలో డాక్టర్ అంబేద్కర్ గ్రంథాలయమును ఏర్పాటు చేయాలని తెలిపారు.ఎస్సీ కార్పొరేషన్( మాదిగ, మాల, రెల్లి) ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని తెలిపారు.భూమి కొనుగోలు పథకం అమలు చేయాలన్నారు. వైయస్సార్ పెళ్లి కానుక లో వధువు పదవ తరగతి ఉత్తీర్ణత నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు.