మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణ ఉద్దేశంతో “నా భూమి- నా దేశం” అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ నందు సింగిల్ యూస్ ప్లాస్టిక్ సేకరించుట అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం ఎంతో నాశనం అవుతుందని, ఈ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు ప్రజల్లో మంచి అవగాహన కల్పించేందుకు ప్రోత్సాహక నగదు బహుమతి పై యూజ్ ప్లాస్టిక్ సేకరణను నిర్వహించడం జరుగుతుందన్నారు. వార్డు సచివాలయాలు విద్యాసంస్థలవారీగా 1000 కేజీల పైన ఎవరు ఏక్కువ తెచ్చినచో, వారిని ఎంపిక చేసి ప్రోత్సాహిక బహుమతులలో మొదటి బహుమతి కింద 50 వేల రూపాయలు,రెండవ బహుమతి 30 వేల రూపాయలు, మూడవ బహుమతి 25వేల రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల యందు నిర్వహించి పట్టణ రహిత ధర్మారం గా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.