Monday, September 25, 2023
Monday, September 25, 2023

31న జరుగు శాంతిర్యాలీని జయప్రదం చేయండి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :ఈనెల 31న పెద్దకడబూరులో మణిపూర్ లో జరుతున్న సంఘటనలకు నిరసనగా ఎంసీపీసి అధ్యక్షులు రెవరెండ్ పాస్టర్ ముత్తు మనోహర్ బాబు ఆధ్వర్యంలో జరుగు శాంతిర్యాలీని జయప్రదం చేయాలని ఎంసీపీసి ఉపాధ్యక్షులు స్వామిదాస్, కోశాధికారి జయపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దకడబూరులోని ప్రెస్ క్లబ్ నందు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమన్నారు. మహిళపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, మానబంగాలు మరియు పిల్లలు, వృద్దులపై జరుగుతున్న మారణహోమాలు సోషల్ మీడయా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతున్న సంఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత వరకు బాధితులకు ఎటువంటి న్యాయం జరగలేదని విమర్శించారు. మణిపూర్ లో శాంతి నెలకొనాలని ఈనెల 31న పెద్దకడబూరులోని సబ్ స్టేషన్ నుండి తాహశీల్దార్ కార్యాలయం వరకు ఎంసీపీసి ఆధ్వర్యంలో శాంతిర్యాలీ ఉంటుందని తెలిపారు. కావున మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దళిత క్రైస్తవులు, పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీసి కార్యదర్శి సామేలు, పాస్టర్లు ప్రేమ్ కుమార్, ఏలియా, దేవపుత్ర, యెహెజ్కేలు, రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img