Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ఘనంగా యుటిఎఫ్ 50వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (ఏపీ యుటిఎఫ్) 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్ర రెడ్డి హాజరై, స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ గావించారు. అనంతరం స్థానిక యుటిఎఫ్ నాయకులతో కలసి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న 86 మంది రోగులకు ఉచితంగా బ్రెడ్లు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 1974, ఆగస్ట్ 10న అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ, లక్ష్యాలతో ఏర్పడిన యుటిఎఫ్ అనతికాలంలోనే రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా కొనసాగుతోందని, నాయకులు, కార్యకర్తలు తమ భాద్యతలు సక్రమంగా నెరవేరుస్తూ , ఉపాధ్యాయుల హక్కుల కొరకు నిరంతరం పోరాడుతూ, ప్రభుత్వ విద్య బలోపేతం చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంతోమంది సీనియర్ నాయకులు తమ జీతాలను, జీవితాలను సంఘం కోసం త్యాగం చేశారని, వారి స్ఫూర్తితో యుటిఎఫ్ మరింత బలంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, హరికృష్ణ, రామాంజినేయులు, హరిశంకర్, బిల్లే రామాంజినేయులు, గోపాల్ రెడ్డి, బాలగొండ్ల శివయ్య, నాగేంద్ర కుమార్, కుళ్ళయప్ప, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img