Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : మండలంలోని చుండి ఆదర్శపాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం మరియు క్రీడా దినోత్సవాలను ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 24నుంచి 28వరకు విద్యార్థులకు సామెతలు,కవితల పోటీలు క్విజ్ పోటీలు వ్యాచరచన మరియు పద్యపఠన కార్యక్రమాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.అలాగే క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రీడాపోటీలను నిర్వహించారు ఈ సందర్బంగా తెలుగు భాషా దినోత్సవం, తెలుగు భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వ్యవహారబాషాపితామహుడు మరియు ఉద్యమకర్త అయిన గిడుగు రామూర్తి పంతులు ని ఆదర్శంగా తీసుకొని తెలుగు బాష యొక్క ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేయాలని కోరారు. తెలుగు భాష కోసం తెలుగు గ్రాంధిక భాషను వ్యవహారిక భాషలోకి మార్చి ప్రజల మన్నలను చూడకున్న వ్యక్తి గిడుగు రామ్మూర్తి అని తెలిపారు. అలాగే తెలుగు భాష విస్తరణకు ఆయన ఎంతగానో కృషి చేశారని ఆయన తెలిపారు. క్రీడాకార్యక్రమాలకు సంబందించి తెలుగు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకుక్రీడాపోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు 4000వేల రూపాయలు విలువ చేసేబహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర్ మరియు ఉపాధ్యాయసిబ్బంది,గ్రామపెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img