శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ
విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని శ్రీనివాస నగర్ లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెన్నం శెట్టి జగదీష్ ,కార్యదర్శి జింక రాజేంద్రప్రసాద్, కోశాధికారి చెన్నం శెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు రమేష్, అర్చకులు రాజేష్ ఆచార్యుల ఆధ్వర్యంలో శనివారం నాలుగవ వారంలో భాగంగా ఏడు వారాల వ్రతం అత్యంత వైభవంగా సామూహికంగా నిర్వహించారు. దాదాపు 50 మంది మహిళలు సామూహికంగా వెంకటేశ్వర స్వామి వ్రతం యొక్క పూజలను నిర్వహించారు. తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు చక్కటి అలంకారాన్ని అర్చకులు గావించారు. స్వామివారి అలంకరణ భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నామని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా, సకాలంలో వర్షాలు కురిసి రైతుల పంటలు అధిక దిగుబడులు రావాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని తలంపుతోనే ఈ వ్రతాన్ని నిర్వహించామని తెలిపారు. ఆలయ కమిటీ వారు ఈ వ్రతం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని తెలిపారు. తీర్థ ప్రసాదాలతో కార్యక్రమం ముగిసింది.