Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఛలో విజయవాడ ధర్నాకు తరలిరండి

పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్ లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.చిన్నప్ప యాదవ్ మాట్లాడుతూ రైతులు వ్యవ సాయం సాగు చేయాలంటే అష్ట కష్టాలు పాలవుతున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జై జవాన్, జై కిసాన్, అనే నినాదాన్ని పక్కన పెట్టారన్నారు. జవాన్ లు దేశాన్ని కాపాడటంలో ముందుంటే దేశానికి అన్నం పెట్టే రైతులు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వ్యవసాయన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తూ, కడుపు మార్చుకుంటూ దేశానికి ఆహారం అందిస్తున్నారు. అలాంటి వారిని విస్మరించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగదన్నారు. కావున రైతులు తీసుకున్న అప్పులన్నీ మాఫీ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలి, రైతులకు సాగు సాయం కింద ఎకరాకు 10వేలు ఇవ్వాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు పంటల బీమా పంట నష్ట పరిహరము అందించాలని, బిందు, తుంపెర సేద్యపరికరాలు, విత్తనాలు ఏరువులు 90శాతము సబ్సిడీ తో ఇవ్వాలని తదితర డిమాండ్లతో విజయవాడ కేంద్రంలో ఈనెల7వ తేదీన ధర్నా చౌక్ లో ఏపీ రైతు సంఘము రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహి స్తున్నామన్నారు. కావున జిల్లా వ్యాప్తంగా రైతులు, కౌలు రైతులు తరలి వచ్చి మహాదర్నాను జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య సీనియర్ నాయకులు సూర్య నారాయణ రెడ్డి, వెంకటరాముడు యాదవ్, చిరంజీవి యాదవ్, ఓబిరెడ్డి, అదినారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img