Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

చలో విజయవాడ వాల్ పోస్టర్లు విడుదల

విశాలాంధ్ర – ఆస్పరి : ఈనెల 7వ తేదీన విజయవాడలో జరుగు రైతు ధర్నా వాల్ పోస్టర్లను బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, ఏపీ రైతు సంఘం తాలూకా నాయకులు హోతురప్ప, పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి, సిపిఐ సీనియర్ నాయకులు బ్రహ్మయ్య, ఉరుకుందప్ప ల చేతుల మీదగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తిమ్మయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ తరహాలో మన రాష్ట్రంలో కూడా ప్రతి రైతు, కౌలు రైతుకు ఎకరానికి 10వేలు రూపాయలు సాగు సాయం అందించాలన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల విత్తనాలు ఎరువులు పురుగు మందులు 90 శాతం సబ్సిడీతో అందించాలని, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలని అనే ఆలోచన ఉపసంహరించుకోవాలని, కౌలు రైతులు అన్ని రకాల పంట రుణాలను రెండు లక్షలు వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్లన్నీ నెరవేర్చాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఆగస్టు 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరుగు మహాధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షులు హనుమంతు, చంద్రశేఖర్, శ్రీనివాసులు, మల్లికార్జున, రామయ్య, వీరశేఖర్, ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img