Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

చంద్రబాబు మచ్చలేని మహానాయకుడు

విశాలాంధ్ర- పెనుకొండ : నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు,బి కే పార్థసారథి ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గము, మరియు పట్టణ కార్యకర్తలు నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద 15వ రోజు సామూహిక రిలే నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టారు. కార్యకర్తలను ఉద్దేశించి పార్థసారథి మాట్లాడుతూ చంద్రబాబు మచ్చలేని మహానాయకుడిగా వెలుగొందాడని ఆయనకున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వము ఆయనని లేనిపోని కేసులలో ఇరికిస్తున్నారని చంద్రబాబు కడిగిన ముత్యంలో బయటికి వస్తాడని పున్నమి చంద్రుడిలా వెలుగొందుతాడని జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే గ్రహణం పట్టే విధంగా ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img