Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

విశాలాంధ్ర, పెద్దకడబూరు :రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి సహకారంతో పెద్దకడబూరు గ్రామానికి చెందిన బాపురం చంద్రశేఖర్ రెడ్డికి రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం దక్కింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపిపి రఘురామ్, సర్పంచ్ రామాంజనేయులు, ఉప సర్పంచ్ విజయేంద్ర రెడ్డి నాయకులు తిక్కన్న, ముక్కరన్న, అర్లప్ప, బ్రహ్మయ్య ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img