విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి శుభకర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా భవాని ఫర్టిలైజర్ షాప్ లో ఫిజికల్ స్టాకు కు ఆన్లైన్ డిబిటి స్టాకు ను పోల్చి పరిశీలించడమైనది. అదేవిధంగా భరత్ ఫర్టిలైజర్స్, ఉమామహేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాలను కూడా తనిఖీ చేయడమైనది ఆన్లైన్ స్టాకు ఫిజికల్ స్టాకు కు తేడా లేకుండా చూసుకోవాలని డీలర్లకు తెలిపారు. త్వరలో రబి సీజన్ మొదలవ్వబోతోంది కావున ఏ డీలర్ కూడా ఎరువుల విషయంలో కానీ మరే విషయంలో గానీ కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు.