విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురము పట్టణం లోని చంద్ర సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. ఈ బి దేవి బుధవారం తనిఖీ చేశారు.
ఈసందర్బంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిస్మెంట్ యాక్ట్ , (ఏపీఎంసి ఈ యాక్ట్ ) మరియు స్కానింగ్ కు సంబంధించి ప్రి కాన్సెప్షన్ ప్రినేటల్ డైయాగ్నోస్టిక్స్ టెక్నిక్స్. (పి.సి.పి. అండ్ టీ యాక్ట్ ) నిబంధనల ప్రకారం ఆసుపత్రి లో ధరల పట్టిక ను ,రిజిస్ట్రేషన్ వాలిడిటీ. డాక్టర్ స్ హర్హతలు, మొదలగు వాటిని పరిశీలించడం జరిగింది. ఆసుపత్రి తనిఖీలో డిప్యూటీ డెమో త్యాగరాజ్, డిప్యూటీ హెఛ్.ఈ .ఓ. గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.