విశాలాంధ్ర – బుక్కరాయసముద్ర: సంక్షేమ పథకాల తో ఆర్థిక భద్రత కల్పించడమేగాక, పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు.అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.బాధిత కుటుంబాలు, వారి ఆర్థిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావటంతో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 19 కుటుంబాలకు రూ.27.06 లక్షలు మంజూరు చేయించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.