Friday, December 8, 2023
Friday, December 8, 2023

ఊపిరితిత్తుల ర‌క్త‌నాళాల్లో గ‌డ్డ‌క‌ట్టిన ర‌క్తం

అత్యాధునిక చికిత్స‌తో కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రిలో ఊర‌ట‌
ఒక్క రోజులోనే న‌యం చేసిన డాక్ట‌ర్ మూడే సందీప్‌

విశాలాంధ్ర అనంతపురం వైద్యం : ఊపిరితిత్తుల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా చేసే ర‌క్త‌నాళాల్లో గ‌డ్డ అడ్డుప‌డి.. తీవ్ర అనారోగ్యానికి గురైన రోగికి కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రి వైద్యులు అత్యాధునిక ప‌ద్ధతిలో చికిత్స చేసి త‌క్ష‌ణం ఊర‌ట క‌ల్పించారు. ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ మూడే సందీప్ ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు. 68 ఏళ్ల వ్య‌క్తికి మ‌ధుమేహం, ర‌క్త‌పోటు, ఊబ‌కాయం, అనియంత్రిత కొలెస్ట‌రాల్‌, దీర్ఘ‌కాల మూత్ర‌పిండాల వ్యాధి.. ఇవ‌న్నీ ఉన్నాయి. ఇటీవ‌లే ఆయ‌నకు కంటిశుక్లాల శ‌స్త్రచికిత‌స చేశారు. అనంత‌రం ఊపిరితిత్తుల్లో తీవ్ర‌స్థాయిలో నీరు చేరింద‌ని చెప్పి చికిత్స కోసం కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి పంపారు. రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఊపిరి పీల్చుకోవ‌డం కూడా క‌ష్టంగా మారడంతో ఆయ‌న‌కు నాన్ ఇన్వేజివ్ వెంటిలేష‌న్ పెట్టి, వెంట‌నే త‌గిన ప‌రీక్ష‌లు చేశాం. అందులో ఆయ‌న‌కు.. ఊపిరితిత్తుల‌కు ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేసే ర‌క్త‌నాళాల్లో ప‌ల్మ‌న‌రీ ఎంబాలిజం.. అంటే ర‌క్తం గ‌డ్డ‌క‌ట్టింద‌ని, దానివ‌ల్ల ఊపిరితిత్తుల‌కు ర‌క్తం త‌గినంత‌గా స‌ర‌ఫ‌రా కావ‌ట్లేద‌ని గుర్తించాం. అందుకే ఊపిరితిత్తుల్లో ఆక్సిజ‌న్ స్థాయి త‌గ్గిపోయి, ర‌క్త‌నాళాల్లో ర‌క్త‌పోటు పెరిగింది. వెంట‌నే ఆయ‌న‌కు త‌గిన చికిత్స చేయ‌క‌పోతే ఊపిరితిత్తులు, గుండె కూడా పాడై మ‌ర‌ణం సంభ‌వించే ప్ర‌మాదం ఉంటుంది. అయితే, ఈ రోగికి అప్ప‌టికే చాలా ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో థ్రాంబోలిసిస్ చేయ‌డం క‌ష్టం అవుతుంది. అందువ‌ల్ల వెంట‌నే మెకానిక‌ల్ థ్రాంబెక్ట‌మీ చేయాల‌ని నిర్ణ‌యించి, పెనంబ్రా ఇండిగో యాస్పిరేష‌న్ సిస్ట‌మ్ అనే అత్యాధునిక ప‌ద్ధ‌తిలో విజ‌య‌వంతంగా ఆప‌రేష‌న్ చేశాం. ఇది చాలా స‌రికొత్త ప‌ద్ధ‌తి, రాయ‌ల‌సీమ‌లో దీన్ని ఉప‌యోగించ‌డం ఇదే మొట్ట‌మొద‌టిసారి. దీని సాయంతో రోగి ఒక్క రోజులోనే కోలుకున్నారు. ఆయ‌న‌కు అప్ప‌టికే మూత్రపిండాల వ్యాధి ఉండ‌టంతో సీనియ‌ర్ నెఫ్రాల‌జిస్టు డాక్ట‌ర్ బ‌ద‌రీనాథ్ ఆధ్వ‌ర్యంలో హీమోడ‌య‌లాసిస్ చేశారు. ఒక్క రోజులోనే ఈ రోగికి ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ 82% నుంచి 96%కు చేరుకుంది. మంచం మీద ప‌డుకుని వెంటిలేట‌ర్ పెడితే త‌ప్ప నిల‌వ‌లేని స్థితి నుంచి త‌న కాళ్ల మీద తాను న‌డుచుకుంటూ వెళ్ల‌గ‌లిగే స్థితికి చేరుకున్నారుఁ అని డాక్ట‌ర్ మూడే సందీప్ వివ‌రించారు.
అస‌లు ప్రాణం నిల‌బ‌డుతుందో లేదో అన్న ప‌రిస్థితిలో వ‌చ్చిన త‌మ‌కు కేవ‌లం ఒక్క రోజులోనే అత్యాధునిక చికిత్స‌తో సంపూర్ణంగా ఊర‌ట క‌ల్పించార‌ని రోగి, ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు డాక్ట‌ర్ మూడే సందీప్‌కు, వైద్య బృందానికి, అనంత‌పురంలోని కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎన్ఏబీహెచ్ ఎక్రెడిటేష‌న్ ఉన్న కిమ్స్ స‌వీరా ఆస్ప‌త్రిలో అత్యుత్త‌మ కార్డియాల‌జీ బృందం ఉంది. అత్యాధునిక ప‌రిజ్ఞానంతో ఇక్క‌డ మంచి చికిత్స‌లు అందిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img