Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పంట నష్టపోయిన ఉద్యాన రైతులకు పరిహారం ఇవ్వాలి

విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన ఉద్యాన రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.2లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని టీడీపీ మండల కన్వీనర్, ప్రధాన కార్యదర్శి పంపు కొండప్ప, దగ్గుపాటి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొందిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెదయ్య, వై.నాగిరెడ్డి అరటి తోటలు వర్షం ధాటికి నేలకూలడంతో సోమవారం టీడీపీ శ్రేణులతో కలిసి ఆయా పొలాలను సందర్శించి అరటి రైతులతో మాట్లాడారు. కుటుంబమంతా కలిసి ఆరుగాలం శ్రమించి పంటను కాపాడుకున్నామని, వర్షం రూపంలో దేవుడు చిన్నచూపు చూడడం వల్ల పంటను పూర్తిగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉద్యాన రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యలు తప్పవన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం రైతులపై వివక్ష చూపుతున్నారని, కనీసం పెట్టుబడులైనా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాది చేతల ప్రభుత్వం అని చెప్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం హెచ్ఓ రత్నకుమార్ కు వినతిపత్రం అందజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గజ్జల నారాయణస్వామి, సర్పంచులు మిడతల శీనయ్య, ఉజ్జినప్ప, ఎంపీటీసీ జాఫర్, తెలుగు రైతు అధ్యక్షుడు బోయ గోపాల్, ఇంద్ర, సోమర నారాయణస్వామి, మల్లికార్జున, బోగినేపల్లి వెంకటేష్, రమేష్ నాయుడు, కోట అంజినప్ప, జూటూరు రామకృష్ణ, ఉజ్జినేశ్వర్, మల్లికార్జున, రామనేపల్లి లక్ష్మన్న, శీనా, స్వర్ణక్క, ముత్యాలప్ప, యశోద, నగేష్, నరేష్, బీరన్న, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img