విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం గ్రామ పంచాయితీకి చెందిన స్థలాలు క్రయవిక్రయాలు సాధారణ సమావేశాలు జరుపుకుండా జరుగుతున్న కాలయాపన తదితర అంశాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సోమవారం ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీకి చెందిన వార్డు సభ్యులు చేజాల ప్రభాకర్, మీనుగా రామాంజనేయులు, ఉరవకొండ పట్టణానికి చెందిన జిలాన్ భాషా, గోపాల్ తదితరులు అనంతపురంలోని స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగంపై తో పాటు ప్రస్తుత పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గ్రామపంచాయతీలో జరిగిన పనులు, నిధులు వినియోగం పంచాయతీ స్థలాలు అన్యక్రాంతమైన అంశాలన్నింటిపై కూడా సమగ్రంగా విచారణ జరపాలని జాయింట్ కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.