విశాలాంధ్ర- గూడూరు : పెడన నియోజకవర్గం గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో పేరిశెట్టి ఉమాకాంతం అధ్యక్షతన మంగళవారం యక్కల ప్రభాకరరావు సంతాప సభలో తొలిత పార్టీ శ్రేణులు యక్కల ప్రభాకర రావు, ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె వి వి ప్రసాద్ మరియు రైతు సంఘం జిల్లా నాయకులు వెలగపూడి ఆజాద్ హాజరయ్యారు. కళాకారుడిగా బాల భాస్కర వివర్స్ సొ సైటీ మేనేజర్ గా, గ్రామ అభివృద్ధి కోసం సమాజాన్ని చైతన్యం చేయడం కోసం పరితపించిన వ్యక్తి కప్పలదొడ్డి మాజీ సర్పంచ్ అమరజీవి కామ్రేడ్ యక్కల ప్రభాకర రావు అని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు కట్టా హేమ సుందర రావు పేర్కొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే వి వి ప్రసాద్ మాట్లాడుతూ, కామ్రేడ్ యక్కల ప్రభాకర రావు, కప్పలదొడ్డి గ్రామం సర్పంచ్ గా రెండు పర్యాయములు చేసిన కాలంలో కమ్యూనిస్టు ఆలోచనలతో మనిషికి కావలసినవి మంచినీరు, విద్య మరియు వైద్యం అందించారు. ఆయన సర్పంచిగా పనిచేసిన హయాంలో గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని భగత్ సింగ్ కాలనీ, నిర్మాణానికి ఆయన ఎనలేని కృషి చేశారు కప్పలదొడ్డి గ్రామంలో యువజన సంఘం స్థాపించిన నాటి నుండి నేటి వరకు కమ్యూనిస్టు ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయిలో అనేక పదవుల్లో పనిచేశారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి హై స్కూల్ స్థాయికి తీసుకు వెళ్లేందుకు బాల భాస్కర వేవర్స్ సొసైటీ నుండి చేనేత కార్మికులు మరియు బోర్డు నెంబర్ల సహకారంతో 60 సెంట్లు స్థలం కేటాయించటం జరిగింది, అలాగే ప్రాథమిక హెల్త్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయించి గ్రామాన్ని ప్రగతి పదంలో నడిపించారు.
కానీ ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల మీద ఓటు బ్యాంకు ప్రేమ తప్ప నిజమైన ప్రేమ లేదని గుర్తు చేశారు. ముఖ్యంగా సహాకార సంఘం చేనేత వస్త్రాల అమ్మకాలకు రిబేటు, కార్మికులకు ట్రిప్ట్ పండ్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పావలా వడ్డీ పథకం అమలు చేయడం వల్ల కార్మికులకు వడ్డీ భారం తగ్గి నిరంతరం పని కల్పించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా ఇంచార్జ్ కార్యదర్శి టీ తాతయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ పామర్రు నియోజకవర్గ కార్యదర్శి దగాని సంగీతరావు బందరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి లింగం ఫిలిప్ పెడన పట్టణ సిపిఐ కార్యదర్శి తుమ్మ చిన్న కొండయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరిశెట్టి మధుసూదన్ రావు తదితరులు ప్రభాకరరావు తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రజానాట్యమండలి కళాకారులు నాయకులు పాడిన విప్లవ గీతాలు ఆహుతులను ఆలోచింపచేసాయి. ఈ కార్యక్రమానికి సిపిఐ పెడన నియోజకవర్గం సిపిఐ నాయకులు సిపిఐ కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.